ఆడవాళ్లు చేసే పెద్ద తప్పు ఒకటి ఉంది. అది ఏంటి అనుకుంటున్నారు కదా.. ! అది ఏంటంటే చాలా మంది ఆడవాళ్లు ముఖం మీద తీసుకున్న శ్రద్ద కాళ్ళ పాదాలపై తీసుకోరు.. ఎంతసేపు ముఖం లేడంటే జుట్టు, గోళ్లు, చర్మం యొక్క రంగు అంతేగాని కాళ్ళని ఎవరు పట్టించుకోరు..కాళ్ళు కూడా మన అందంలో ఒక భాగమే అని గుర్తుపెట్టుకోవాలి. ముఖం చూసి ఆ అమ్మాయి అందంగా ఉందా,  లేదా అన్న అభిప్రాయానికి వస్తారు అని కేవలం ముఖ అందం మీద మాత్రనే కాకుండా కాస్త కాళ్ళ పగుళ్లు మీద కూడా ఒక లుక్ వేయండి.. చెప్పులు కొనడానికి షాప్ కి వెళ్ళినప్పుడు పగిలిన మీ పాదాలను చూసి ఎవరన్నా మొహం ఎబ్బెట్టుగా పెడతారు.. అందుకనే పాదాల పగుళ్లు తగ్గే చిట్కాల గురించి కూడా తెలుసుకోండి.. !!


ఒక గిన్నెలోకి  కొంచెం ఆముదం, రోజ్ వాటర్,  నిమ్మ రసంలను  సమ పాళ్ళల్లో కలిపి , పాదాలు పగిలిన చోట ప్రతి రోజు 2 లేక 3 సార్లు రాస్తూ ఉండాలి.. పాదాలకు రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని రాసుకుని  పాడుకోవాలి ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితం ఉంటుంది..అలాగే రాత్రి పడుకునే ముందు వేడి చేసిన కొబ్బరి నూనెను పాదాల పగుళ్ళకు పూయవలెను..పొద్దునే లేవగానే వేడి నీళ్ళల్లో పాదాలను 15 నిమిషాలు పాటు  వుంచవలెను. తర్వాత.. పగుళ్ళను నిదానముగా బ్రష్ తో శుభ్రం చేయవలెను. తర్వాత శుభ్రంగా పాదాలను తుడిచి మళ్ళీ  నూనెను పూయవలెను .




అలాగే 1 స్పూన్ మైనం ( wax ),  1 స్పూన్  ఆవు నెయ్యిని కలిపి వేడి చేయవలెను . ఇలా కరిగిన పదార్ధాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే  పాదాలా పగుళ్ళల్లో వేయవలెను. పాదాల పగుళ్ళు తగ్గే వరకు ప్రతి రోజు ఆచరించవలెను.ఇలా గనక ప్రతి రోజు చేస్తే ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు.అలాగే  25 గ్రాముల మైనం లో,  100 గ్రాముల ఆవాల నూనెను వేసి , ఒక పొంగు వచ్చే వరకు మరగించవలెను. నూనె చల్లారక ఒక వెడల్పు మూతి కలిగిన పాత్రలో నిల్వ చేసుకొనవలెను. చల్లారిన తర్వాత ఆయింట్మెంట్ లాగ తయారవును. దీనిని చర్మ పగుళ్ళు, పాదాల పగుళ్ళకు పూయవలెను. ఇలా ఈ మిశ్రమాన్ని పూయడం వల్ల పాదాల పగుళ్ళు తగ్గిపోవును. ఒక వేళ మొదట పగుళ్ళు పెరిగిన, నిదానముగా తగ్గిపోవును. ప్రతి రోజు క్రమంగా ఆయింట్మెంట్  లాగా పూయవలెను.

మరింత సమాచారం తెలుసుకోండి: