ఎన్నికల వేళ అందరికీ ఓటు విలువ గుర్తుకు వస్తుంది.ముఖ్యంగా శాసన మండలి ఎన్నికలకు ముందే నేతలకు ఓటు విలువ తెలిసింది కాబోలు.. ముందుగానే ఓటర్లను క్యాంపుల్లో కుక్కారు. సిద్ధి పేట డిగ్రీ కళాశాలకు తెలంగాణ మంత్రి వచ్చారు.  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏం చెప్పారు ? ఏమని ఉపన్యాసం చేశారు?
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది. దీనిని అందరూ తప్పక వినియోగించుకోవాలి. ఒక ప్రజా ప్రతినిధి, మరో ప్రజాప్రతినిధిని వినియోగించుకునే సందర్భం ఇది. అందరూ తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకోవడం రాజ్యాంగ ధర్మం, విధి కూడా అని హరీష్ రావు పేర్కోన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన డిగ్రీ కలాశాల పోలింగ్ బూత్ లో ఆయన తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. శాసన మండలి లో స్థానిక సంస్థల నుంచి తమ ప్రతినిధిని ఎన్నుకునే సందర్భం ఇదీ అని హరీష్ రావు చెప్పారు. గతంలో స్థానిక సంస్థల నుంచి మండలికి ప్రతినిధిని పంపే ఎన్నికలలో శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు  ఓటు హక్కు లేదని, ఇటీవలే ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించిందని హరీష్ రావు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు,

మంచిర్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే దివాకర్‌ రావు తమ ఓటును వినియోగించుకున్నారు. అదే విధంగా  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో  శాసన సభ్యుడు భూపాల్‌ రెడ్డి, శాసన మండలి సభ్యుడు ఫారుక్‌ హుస్సేన్‌వోటు వేశారు.  పటాన్‌చెరూలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి  తన అనుచరులతో కలసి వచ్చి ఓటు వేశారు. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  కూడా తన ఓటు హక్కుు వినియోగించుకున్నారు. దాదాపు 90 శాతం పైచిలుకు పోలింగ్ జరుగుతుందని రాజకీయపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: