ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ టీచింగ్ సిబ్బందికి గుడ్‌న్యూస్ చెప్పారు. వారికి కూడా ఏఐసీటీఈ స్కేల్స్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేసేశారు. ఏఐసీటీఈ స్కేల్స్ వర్తించేలా ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది.. ప్రస్తుతం పని చేస్తున్న 1600 మంది తోపాటు ఉద్యోగ విరమణ చేసిన  900 మందికి దీని ద్వారా లాభం కలుగుతుంది.

వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది.. కానీ.. అధికారులు రకరకాల కారణాలతో ఫైల్ ను  ఆలస్యం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆర్ధికంగా భారమైనా సీఎం దీనికి ఆమోదం తెలిపారని.. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అంటున్నారు. 2019 నుంచి ఆగస్టు నుంచి ఆర్ధిక ప్రయోజనాలు వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారని ఆయన తెలిపారు. 2016 నుంచి 19 వరకు రావాల్సిన పెరిగిన జీతాన్ని అరియర్స్ రూపంలో చెల్లిస్తారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: