షెడ్యూల్‌ కులాల వర్గీకరణ కోసం  ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు. ఆయన కొన్ని విజయాలు సాధించినా.. కోర్టు తీర్పుల వల్ల అది దక్కకుండా పోయింది. ఇటీవల ఆయన మరోసారి ఆ ఉద్యమాన్ని రగిలిస్తున్నారు. షెడ్యూల్‌ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటున్నారు. మాదిగ రిజర్వేషన్లకు మూడు దశాబ్దాలుగా హామీ ఇస్తున్న వస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతన్న షెడ్యూల్‌ కులాల వర్గీకరణపై చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  అన్నారు.

మాదిగల దృష్టిలో భాజపా దోషిగా ఉందన్న మందకృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమన్నారు. జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని మందకృష్ణ మాదిగ  హెచ్చరించారు. ఫిబ్రవరి 10న హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని 12 గంటల పాటు దిగ్భందిస్తామని మందకృష్ణ మాదిగ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: