అందం అందరికి అవసరం. అయితే అలాంటి అందం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.. అలానే కొందరు చేసిన ప్రయత్నాల్లో లోపాలు ఉండటం కారణంగా తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఆ లోపాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఎంతోమంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే? తరచూ ముఖం కడగడం. తరచూ ముఖం కడగడం కారణంగా మురికి పోయి తాజాగా కనిపించచ్చు అని భ్రమలో ఉంటారు.. అయితే తరచూ ముఖం కడగటం వల్ల చర్మం పొడిబారుతుంది. మృతుకణాలు ఒక పొరగా ఏర్పడి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. 

 

మురికి తొలిగించుకోవాలి అని అభిప్రాయంతో తరచూ క్లెన్సర్‌ని వాడుతుంటారు. అతిగా అవి వాడటం వల్ల చర్మం ఎర్రగా కమిలిపోయి ప్రమాదం ఉంది. 

 

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి తరచూ ఏదో ఒక క్రిములు వాడుతుంటారు. అలా వాడటం వల్ల పీహెచ్ స్థాయిల మార్పు చర్మం ప్రభావంపై పడుతుంది. రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. 

 

ఏదైనా కూడా లిమిట్ లోనే ఉపయోగించాలి. అలా కాదు అని ఎక్కువగా ఉపయోగిస్తే దెబ్బ తీస్తాయి. ఎప్పుడు కూడా అతివృష్టి.. అనావృష్టి ప్రమాదకరమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: