క‌రోనా క‌ట్ట‌డి కోసం మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పూర్తిగా సురక్షితం అని కేంద్రం భా వించిన ప్రాంతాల్లో మాత్రం ఈనెల 20వ తేదీ నుంచి కొంత సడలింపులు ఉంటాయ‌ని కూడా ప్రధాని చెప్పారు. రాష్ట్రంలో ని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈనేపథ్యంలో... ఆ రెండు జిల్లాల్లో 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించే అ వకాశాలున్నాయని భావిస్తున్నారు. 

 

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు న‌మోదు కాలేదు. అయితే పొరుగున ఉన్న  విశాఖ, ఒడిశాలో ఈ సమస్య ఉంది.   ఈ నేపథ్యంలో... ఆ రెండు ప్రాంతాల్లో నుంచి ఇటువైపు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం, విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంతో పూర్తిగా మిళితమైౖ ఉంటుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాలు, మండలాలు (జామి-ప ద్మనాభం) సైతం విశాఖ గ్రామీణ ప్రాంతాలను ఆనుకొని ఉంటాయి. దీంతో అక్కడి వారు ఇక్కడికి.. ఇక్కడి వారు అక్కడికి సునాయాసంగా వెళ్లి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి చోట్ల నిఘా పటిష్టం చేయ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: