హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్లపై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొందరు తాము చేసిన పనులో లేదా తాము చేసిన సాయాలో వీడియోల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయం చేసిన వారికి ప్రశంసలు.. సాయం చేయని వారిపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు అనసూయను సైతం ట్రోల్ చేయడంతో ఆమె తిక్క నషాళానికి అంటినట్లుంది. ఈ క్రమంలోనే ఆమె తన ట్విట్టర్ అక్కౌంట్లో ఘాటుగా స్పందించింది.
ముందుగా ఆమె చాలా మంది మీరు ఏం హెల్ఫ్ చేయడం లేదు... ఇంట్లో కూర్చొంటున్నారు అని ప్రశ్నిస్తున్నారని.. వీళ్లు ఏదైనా సాయం చేసినట్టు ఫొటోలు పెడితేనా నమ్ముతారు ? వీళ్లకు ఏం అర్థం కాదని ట్వీట్ చేసింది. ఆ వెంటనే తన ట్వీట్‌కు తానే రిప్లే ఇచ్చుకుంటూ ఎవరికి సాయం అందాలో వారికి అందుతుంది.. ఎవరికి తెలియాలో వారికి తెలుస్తుంది.. మిగిలింది అంతా బేకార్ ముచ్చటని పోస్ట్ చేసింది. దీనిని బట్టి తాను సాయం చేయడం లేదని విమర్శలు చేసే వాళ్లతో పాటు కొందరు గోరంత సాయం చేసి కొండత డబ్బాలు కొట్టుకునే వారిని టార్గెట్‌గా చేసుకుని ఆమె సైటైర్లు వేసిందన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ బేకార్ డైలాగ్ కూడా వాళ్లకే అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
Evariki help andalo vaariki andutundi.. evariki teliyaalo vaariki telustundi.. migatadanta bekar muchata.. kada??☺️ https://t.co/Idy5OTuI2R
— anasuya Bharadwaj (@anusuyakhasba) April 22, 2020
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple