దేశ వ్యాప్తంగా వలస కూలీలు ఇప్పుడు సొంత ప్రాంతాలకు భారీగా తరలి వెళ్తున్నారు. వీరి నుంచి కరోనా తీవ్ర స్థాయిలో విస్తరించే అవకాశం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ విషయంలో కేంద్రం జాగ్రత్తగా లేకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. 

 

ఈ తరుణంలో తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర కీలక వ్యాఖ్యలు చేసారు. వలస కార్మికుల కారణంగా కరోనా కేసులు పెరుగుతాయని తెలంగాణా లో కరోనా కేసులు పెరగడానికి వాళ్ళే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా మర్కాజ్ యాత్రికుల తర్వాత కరోనా ఎక్కువగా విస్తరించేది వలస కార్మికుల నుంచే అంటూ మంత్రి వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: