దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బన్నీ ఉత్సవంలో మునుపటి లాగే  తలలు పగలకోట్టుకున్నారు. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించు కునేందుకు రెండు వర్గాలుగా భక్తులు విడిపోయారు. జైత్రయాత్రలో రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. దేవరగట్టులో యుద్ద వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనతో దేవరగట్టులో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ఎం చేయాలో తెలియక ప్రేక్షక పాత్ర వహించారు పోలీసులు. దేవరగట్టులో వైద్య సిబ్బందిని, తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు  చేయలేదు. క్చత గాత్రులను ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించ్రు. దేవరగట్టులో జోరుగా నాటుసారా విక్రయాలు  జరుగుతున్నాయి అనే ఆరోపణలు వచ్చాయి. కరోనా కట్టడిలో భాగంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలు రద్దు  చేసారు. దేవరగట్టులో భక్తుల రాక ద్రుష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు భక్తులు. దేవరగట్టుకు దాదాపు లక్ష మంది వరకు భక్తులు వచ్చారు అని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: