తెలుగు దేశం నేత, ఎమ్మెల్సీ లోకేష్ స్పీడ్ పెంచారు. అంతకు ముందు కేవలం ట్విట్టర్ వరకే పరిమితం అయిన ఆయన ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఆయన ఏపీ మొత్తంలో వర్షాల వలన పంట నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి జనానికి నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. అయితే దీనిని కూడా అధికార పార్టీ ట్రోల్ చేస్తోంది అనుకోండి. అయితే తాజాగా ఆయన రైతులకు బేడీలు వేసి తీసుకు వెళ్ళిన అంశం మీద ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూమి త్యాగం చేసిన రైతులకు బేడీలు వేస్తే రాష్ట్రాన్ని దోచిన జగన్ రెడ్డిని ఇనుప గొలుసులతో తీసుకెళ్లాలని అన్నారు.

ఎస్సీల మీద కూడా 'ఎస్సి,ఎస్టీ' అట్రాసిటీ కేసు పెట్టడమే రాజారెడ్డి రాజ్యాంగం అని ఆయన అన్నారు. అత్యుత్సాహంతో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకొని, వెంటనే విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెంలో రైతు కుటుంబాలను పరామర్శించి వారికి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చానని చెబుతూ ఆయన అందుకు సంబందించిన పిక్స్ కూడా షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: