మనామ: అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ పీ ఫైజర్ వినియోగానికి బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయంలో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు బహ్రెయిన్ జాతీయ ఆరోగ్య శాఖ ఆమెదం తెలిపింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో శుక్రవారం కథనాలు వచ్చాయి. పీఫైజర్ వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పూర్తిగా పరీశీలించి, సమీక్షించిన తరువాతనే ఆమోదం తెలిపినట్లు బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికాలోని పీ ఫైజర్ సంస్థతో పాటు జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థ కూడా పాల్గొంది.    

పీఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు కొద్ది రోజుల క్రితమే ఇంగ్లాండ్ కూడా ఆమెదం తెలిపింది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను ఆమెందించిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ మాత్రమే.. గత నెల చైనాకు చెందిన మరో వ్యాక్సిన్‌ వినియోగానికి కూడా బహ్రెయిన్ ఆమెదం తెలిపింది. చైనాకు చెందిన సినోఫార్మ్ తయారు చేసిన ఆ వ్యాక్సిన్‌ను దాదాపు 6000 మందికి అందజేసింది కూడా. అయితే దాని ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇక ఇప్పుడు పీ ఫైజర్ కూడా రానుండడంతో బహ్రెయన్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ అమెరికాలోని పీఫైజర్ సంస్థ నుంచి బహ్రెయిన్‌‌కు ఎప్పుడు అందుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.     

ఇదిలా ఉంటే ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనాను నిర్మూలించేందుకు అన్ని దేశాలూ ఎంతగానో కష్టపడుతున్నాయి. అమెరికా, రష్యా, భారత్, చైనా, ఇంగ్లండ్ వంటి అనేక దేశాలు ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలవుతున్నాయి. ఈ దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లన్నీ దాదాపు 90 శాతానికి పైగా ఫలితాలనిస్తున్నట్లు ఆయా వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రకటించుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లలో చాలావరకు చివరి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి.     


మరింత సమాచారం తెలుసుకోండి: