తిరుమల తిరుపతి దేవస్ధానం అలిపిరి టోల్‌గేట్‌ చార్జీల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జి.వాణీమోహన్‌ ఉత్తర్వులు జారీ చేసారు. ఇప్పటి వరకు అలిపిరి ఘాట్‌ రోడ్డులో టూ వీలర్ల నుండి వసూలు చేస్తున్న టోల్‌ ఫీజు  పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిన్నకార్లు, జీపులు, టాటా ఏసీలు, టాక్సీలకు  ఇక పై రూ.50 రుసుము వసూలు చేయనున్నారు.

మినీ బస్సులు, మినీ లారీలు, గూడ్స్‌ వెహికల్స్‌కు టోల్‌ ఫీజును 100 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జేసీబీలు, మిక్సర్లు, క్రేన్లు, హెవీగూడ్స్‌ కంటైనర్ల టోల్‌ ఫీజును 200లకు పెంచారు. బస్సులు, ట్రక్కుల టోల్‌ ఫీజును 200లకు పెంచారు. భారీ ట్రక్కుల టోల్‌ ఫీజును 200కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: