ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు పాల్గొనడం పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వార్డు వాలంటీర్లు రాజకీయ ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేసే అభ్యర్దుల తరపున ఓటర్లను ప్రభావితం చేయకూడదు అని స్పష్టం చేసింది. ఓటు వేయకపోతే.. ప్రభుత్వ పధకాలు వర్తింవని బెదిరించకూడదు అని పేర్కొంది. ఓటర్ స్లిప్పులను వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేందుకు వీలు లేదు అని పేర్కొంది.

వార్డు వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. వారి ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... వార్డు వాలంటీర్లపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లను ఉపయోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్దం అని పేర్కొంది. పట్టణ ప్రాంతాలలో జరుగుతున్న ఎన్నికలలో ఈ ఆదేశాలను గట్టిగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లు దైనందిన విధులు నిర్వహించడంలో ఎటువంటి అభ్యంతరం లేదన్న కమిషన్... కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు ఈరోజు సర్క్యూలర్ పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: