తెలంగాణలోని 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది అని ఆయన చెప్పుకొచ్చారు. కృష్ణా, గోదావరి నీళ్లను సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం జరుగుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. నీళ్లు నిధులు నియామకాలు టాగ్ లైన్ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం అని వెల్లడించారు.

తెలంగాణ లక్ష్యం నెరవేరింది అని అన్నారు. జోనల్ వ్యవస్థ పై నిర్ణయం పెండింగ్ లో ఉండటం వల్ల ఉద్యోగాల భర్తీలో కొంత జాప్యం జరిగింది అనారు. ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తాం అని హామీ ఇచ్చారు. షర్మిల దీక్షపై సుమన్ స్పందించారు. తెలంగాణ మీద షర్మిలకు అవగాహన లేదు అని అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం ఒక జోక్ అని అన్నారు బాల్క సుమన్.

మరింత సమాచారం తెలుసుకోండి: