ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఓపెనర్లు న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ట్రెంట్ బౌల్ట్, టీం సౌతీ ఇద్దరూ కూడా పదునైన బంతులతో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో స్వింగ్ చేస్తున్నారు. అయినా సరే రోహిత్, గిల్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గట్లేదు. అయితే ఇక్కడ న్యూజిలాండ్ బౌలర్లు రోహిత్ ని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది.

ప్రధానంగా సీనియర్ బౌలర్ టీం సౌతీ స్వింగ్ తో రోహిత్ ని టార్గెట్ చేసి బంతులు విసురుతున్నాడు. అయితే రోహిత్ మాత్రం ఇన్ స్వింగ్ విషయంలో జాగ్రత్త పడుతూ అవుట్ స్వింగ్ విషయంలో మాత్రం షాట్ లు ఆడుతున్నాడు. బౌల్ట్ ఎక్కువగా ఇన్ స్వింగ్ వేయడంతో రోహిత్ బాల్స్ వదిలేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే ఇద్దరూ కూడా సమర్ధవంతంగా పేస్ బౌలింగ్ అటాక్ ని ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: