తెలుగు న‌టీన‌టుల‌కు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌చారం ఎలా జ‌రిగిందో చూశాం. కురుక్షేత్ర సంగ్రామంక‌న్నా భ‌య‌క‌రంగా యుద్ధం జ‌రిగింది. ఫిరంగ‌లు బ‌దులు మాట‌లే తూటాల్లా పేలాయి. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఆహా అనిపించాయి. ఎవ‌రూ త‌గ్గ‌లేదు. చివ‌ర‌కు విజ‌యం సాధించిన త‌ర్వాత కూడా రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌లైన త‌ర్వాత సాధార‌ణ రాజ‌కీయాలు నెమ్మ‌దిస్తాయి. కానీ మాలో మాత్రం ఎన్నిక‌లైన త‌ర్వాత అస‌లైన రాజ‌కీయం న‌డుస్తోంది. ఎవ‌రికి వారు త‌మ‌దే పైచేయి అని నిరూపించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఓట‌మి పాలైన త‌ర్వాత తీర్పును గౌర‌వించి క‌ళాకారుల‌కు మేలు చేయ‌గ‌లిగింది చేయాలి. కానీ రాజీనామాల ప‌ర్వంతో నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టిస్తున్నారు. సినిమాకు మ‌సాలాను ద‌ట్టిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో? ఎవ‌రు చేయిస్తున్నారో?  దేనికోసం చేస్తున్నారో?  ప్ర‌జ‌ల‌కు అవ‌గ‌త‌మ‌వుతోంది. కానీ తెర‌మీద న‌టిస్తే అవార్డులు వ‌స్తాయో రావో తెలియ‌దుకానీ ఇప్పుడు నిజ‌జీవితంలో వీరు న‌టిస్తున్న‌, పోషిస్తున్న పాత్ర‌లకు మాత్రం జాతీయ అవార్డులు ఇవ్వొచ్చ‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa