హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై సాయంత్రం 6.30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీ నివాసంలో భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల క‌మిటీ భేటి కానున్న‌ది. ఇప్ప‌టికే 13 మంది మృత్యువాత ప‌డ్డ‌ట్టు డీఎన్ఏ టెస్ట్‌ల ద్వారా మృత‌దేహాల‌ను గుర్తించారు. ఘ‌ట‌న స్థ‌లంలోనే బిపిన్ రావ‌త్ మ‌ధులిక మృత‌దేహం ల‌భ్య‌మైనది. ప్ర‌స్తుతం బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు ఆర్మీ అధికారులు. గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో మృత‌దేహాలు ఉన్నాయి. డీఎన్ఏ ఆధారంగానే మృత‌దేహాల‌ను గుర్తించారు.

తొలుత కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు పార్ల‌మెంట్‌లో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం పై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే తాజాగా సాయంత్రం 6.30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీ నివాసంలో భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల క‌మిటీ భేటీ కానుండ‌డంతో ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే కొంత మంది సోష‌ల్ మీడియాలో బిపిన్ రావ‌త్ మృతి చెందార‌ని వార్త‌లు పోస్ట్ చేసి డిలీట్ చేసారు. ఈ త‌రుణంలోనే  ప్ర‌ధాని నివాసంలో భేటీ కావ‌డంతో ఆ స‌మ‌యంలోనే కీల‌క విష‌యాల‌ను ప్ర‌ధాని వెల్ల‌డించే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. సాయంత్రం జ‌రిగే ఈ భేటీలో ఏమి ప్ర‌క‌టిస్తారో  వేచి చూడాలి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: