నేడు పెట్రోల్, డీజిల్ ధరలు గత 15 రోజుల లనే నేడు కూడా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర ఈరోజు కూడా పెరిగింది.. అలానే డీజిల్ ధర కూడా ఈరోజు పెరిగింది. గత 15 రోజుల నుంచి పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది. దీంతో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు డీజిల్ ధర కూడా అటు ఇటు కదలడం మొదలు పెట్టింది. 

 

వివిధ మెట్రో నగర్లో నేడు బుధవారం పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసల చొప్పున పెరగగా డీజిల్ ధర5 పైసలు పెరిగి అందరికి షాక్ ఇచ్చింది. హైదేరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసలు పెరుగుదలతో రూ. 78.96కు చేరగా, డీజల్ ధర గత నాలుగు రోజుల నుంచి స్థిరంగా కొనసాగగా ఈరోజు 5 పైసలు పెరుగుదలతో 71.85 రూపాయలకు చేరింది. ఇంకా విజయవాడలోని పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. 

 

దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

దీంతో 15రోజుల ముందు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర 10పైసలు, 15 పైసలు  ప్రకారం పెరిగి చివరికి 79 రూపాయలకు దగ్గరలో ఉంది. ఇంతలా రోజురోజుకు పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది మార్కెట్ నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. మారో వైపు గత 15 రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం 15 రోజుల్లో పెట్రోల్ ధరపై 3 రూపాయిలు పెరిగింది. ఏది ఏమైనా ఈ వార్త వాహనదారులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: