మీరు చాలా సార్లు ATM కు పోయి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఇలా ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేసుకుంటే ATM సర్వీస్ ఛార్జీలు పే చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసమే ప్రముఖ దేశీయ బ్యాంక్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త తెలియజేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత చార్జీలు వసూలు చేసే పద్ధతిని తొలగిస్తున్నాము అని sbi తెలియజేయడం జరిగింది.

 


మీరు sbi ఎటిఎం కార్డుతో ఎన్ని సార్లైనా డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఇది ఏ రకమైన కార్డు అయినా వర్తిస్తుంది. అంతేకాకుండా ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా లేనట్లే. నిజానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం లాక్ డౌన్ అని sbi అధికారులు తెలియజేస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ sbi ఎటిఎం లో మాత్రమే కాకుండా బ్యాంకులో కూడా డబ్బులు విత్ డ్రా చేసిన ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు అని sbi తెలియజేయడం. ఇక విధానం జూన్ 30 వరకు ఎటువంటి ATM సర్వీస్ ఛార్జీలు ఉండవు అని స్పష్టంగా తెలియజేసింది.

 


సాధారణంగా ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్  కస్టమర్లు వాడే కార్డును బట్టి బ్యాంకు నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీని కోసం చాలా మంది ఆ లిమిట్ లోపే డబ్బులు విత్ డ్రా చేసుకుంటూ వస్తారు. ఒకవేళ లిమిట్ దాటి ఎవరైనా డబ్బులు డ్రా చేస్తే అలాంటి ఈ సమయంలో సర్వీస్ ఛార్జీలు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. కానీ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ ఛార్జీలు లేవని తెలియచేయడంతో కోట్లాదిమంది వినియోగదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: