ప్రస్తుతం ప్రపంచాన్ని నాశనం చేసిన చేస్తున్న వైరస్ ఏంటి అంటే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ ని చైనా వైరస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది కాబట్టి. ఇంకా ఈ వైరస్ ని నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేశారు. ఇంకా ఈ లాక్ డౌన్ కారణంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. 

 

ఇంకా అందుకే ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఏదైనా చిన్న బిజినెస్ అయినా చెయ్యాలి అని అనుకుంటుంటారు. ఇంకా అలా బిజినెస్ చెయ్యాలి అని ఆలోచించే వారికీ కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. బిజినెస్ చెయ్యాలి అని ఆలోచిస్తే చాలా ఆప్షన్లు ఉన్నాయి. 

 

ఇంకా అందులో పాల డైరీ బిజినెస్ ఒకటి. అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తోనే ఈ అద్భుతమైన బిజినెస్ ప్రారంబించచ్చు. రూ.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌తో డెయిరీ ప్రొడక్టుల బిజినెస్‌ను స్టార్ట్ చేస్తే ఏకంగా 70 వేల రూపాయలకు పైగా సంపాదించుకోవచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో 5 లక్షల రూపాయిల అంటే కొంచం కష్టమే. 

 

కానీ ఆ కష్టాన్ని కూడా కేంద్రం లేకుండా చేస్తుంది. ఏలా అంటే? ముద్రా లోన్ స్కీమ్ కింద నిధులు పొందొచ్చు. బ్యాంకులు ముద్రా లోన్ కింద మీకు అయ్యే ఖర్చులో 70 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద అందిస్తాయి. డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మొత్తంగా 16 లక్షల రూపాయిల వరకు ఖర్చవుతుంది. ఇంకా ఆ 16 లక్షల్లో ఏకంగా 11 లక్షలు కేంద్రం అందిస్తుంది. మీరు కేవలం 5 లక్షలు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మీరు ఐడియాతో బిజినెస్ చేస్తే నెలకు ఏకంగా 75 వేల రూపాయిల వరకు మిగిల్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: