అత్యాధునిక సాంకేతిక హంగులు హోండా కంపెనీ సొంతం. ఈ కంపెనీ నుంచి ద్విచ‌క్ర‌వాహ‌నం వ‌స్తోందంటే చాలు కుర్ర‌కారుకు కిర్రెక్కి పోతుంది. ఎంత‌దూరమైనా స‌రే డ్రైవింగ్‌కి వెళ్లే సౌక‌ర్యం ఈ వాహ‌నాల‌కుంటుంది. ప్రముఖ వాహన సంస్థ హోండా.. తన సరికొత్త సీబీ350 ఆర్ఎస్ మోడల్ ను భారత మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధ‌ర రూ.1.96 లక్షలు. అగ్రెసివ్ డిజైన్, ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ ఆకట్టుకుంటోంది.

ద్విచక్రవాహనాల్లో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో ప్రధానమైంది హోండా. ఈ కంపెనీ నుంచి అత్యుత్తమ వాహనాలు భారత మార్కెట్లో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా తన సరికొత్త మోడల్ ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. అదే హోండా సీబీ350 ఆర్ఎస్. మేడిన్ ఇండియా ఫర్ ద వరల్డ్ లో భాగంగా విడుద‌లైన ఈ బైక్ అధునాత‌న‌మైన‌, ఆక‌ర్ష‌ణీమైన ఫీచ‌ర్లు, రూపంతో అద‌ర‌గొడుతోంది.

ఈ సరికొత్త సీబీ 350 ఆర్ఎస్ మోటార్ సైకిల్ భారీ ఫ్యూయల్ ట్యాంకును కలిగి ఉంది. వై ఆకారపు అల్లాయ్ వీల్స్ తో అందుబాటులోకి వచ్చింది. వృత్తాకారపు ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, అండర్ సీట్ స్లీక్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుల వల్ల మోడర్న్ రోడ్‌స్ట‌ర్‌ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా బ్లాక్ స్మోకెడ్ ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్ తో స్పోర్టీ లుక్ వ‌చ్చింది. 350సీసీ ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఓహెచ్ సీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 5500 ఆర్పీఎం వద్ద 20.7 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 30 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా అడ్వాన్సెడ్ పీజీఎం-ఎఫ్ఐ సిస్టంతో పనిచేస్తుంది. ఇంజిన్ కు ఆప్టిమమ్ ఫ్యూయల్ డెలీవరి వల్ల మెరుగైన పనితీరును క‌న‌ప‌రుస్తుంద‌ని ఆటోమైబైల్ వాణిజ్య వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఈ స‌రికొత్త ద్విచ‌క్ర‌వాహ‌నంలో  ఫస్డ్ అడ్వాన్సెడ్ డిజిటల్ అనలాగ్ మీటర్ తో పాటు ఇంటిగ్రేటెడ్ డీటేల్స్ టార్క్ కంట్రోల్ తో పాటు ఏబీఎస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తో కూడిన ఇంజిన్ ఇన్హిబిటర్ బిగించారు. గేర్ పిస్టన్ ఇండికేటర్, బ్యాటరీ వోల్టేజి లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్ టైం మైలేజీ, యావరేజ్ మైలేజి, డిస్టెన్స్ ఎంప్టీ అనే మూడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ మోడ్స్ లో మంచి లాంగ్ డ్రైవ్ రైడింగ్ అనుభూతి పొందవచ్చ‌ని కంపెనీ పేర్కొంటోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: