ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఏదో ఒక విధంగా నేరాలకు పాల్పడుతున్నారు.  ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు పోలీసులు.  అయినప్పటికీ ఇక నేరాలకు పాల్పడెందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు సైబర్ కేటుగాళ్లు.  రోజురోజుకు సైబర్ నేరగాళ్ల బెడద అటు జనాలకు తలనొప్పిగా మారిపోతుంది.



 అయితే సైబర్ నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఇటీవలే మరో సారి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. గత పదేళ్ల తో పోల్చి చూస్తే ప్రస్తుతం సైబర్ నేరాలు మరింత పెరిగాయి అంటూ ఆయన తెలిపారు. ఇక ప్రజలను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను వెతుకుతున్నారు అంటూ తెలిపారు.  ముఖ్యంగా యువతను పలు వెబ్సైట్ల పేరుతో ఆకర్షిస్తున్నారన్నారు.



 యువతను ఆకర్షించేలా పలు రకాల ప్రకటనలు చేసి ఇక యువత ఆ వెబ్ సైట్ లోకి వెళ్ళగానే.. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారు  అంటూ హెచ్చరించారు సీపీ అంజనీ కుమార్. గతంలో తెలియని ప్రదేశాలకు వెళ్ళద్దు అంటూ జాగ్రత్తలు చెప్పేవారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా  తెలియని వెబ్సైట్లకు వెళ్ళద్దు అంటూ హెచ్చరించారు సీపీ అంజనీ కుమార్. ఇక ఎప్పుడైనా గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చి వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీపీ అంజనీ కుమార్.. ఇక ఏ మాత్రం సైబర్ నేరగాళ్ల వలలో పడిన ఏకంగా ఖాతాలు ఖాళీ కావడం ఖాయం అంటూ హెచ్చరించారు. అందుకే గుర్తు తెలియని వెబ్ సైట్లు, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cp