బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ తల నుండి వచ్చినవాడు అని అర్ధం, అతను సర్వ జ్ఞానం, అత్యున్నతమైన మేధా శక్తిని కలిగిన అపర మేధావిగా సకల వేదాలు, ఇతిహాసాలు అవపోసాన పట్టటమే కాకుండా మిగిలిన కులాలకు, జాతులకు చెందినవారి కోరికలను, ఆశలను, సమస్యలను నేరుగా దైవానికి విన్నవించే అవకాశం కలిగిన సర్వోత్తముడు అని, తరతరాల నుండి యుగయుగాల నుండి లోకాలనేలే సకల దేవతామూర్తుల చేత సైతం సమున్నతంగా గౌరవించబడిన ఏకైక వ్యక్తి ఈ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని నోటి వాక్కు బ్రహ్మ వాక్కుగా ప్రతీతి. కావున ఆయనకు ఎలాంటి ఇబ్బంది గానీ, కోపం గానీ కలిగించే పనులు చేయకుండా బాధ్యతగా మెలిగేవారు. ఇక నిరూపితం కాబడిన గత చరిత్రను ఒకసారి మన్నన చేసుకున్నట్లయితే అతను (బ్రాహ్మణుడు) అడుగుపెట్టిన ప్రతిచోటా దేశాలను, రాజ్యాలను పాలించే రాజులు సైతం స్వయంగా అత్యున్నతమైన స్థాయిలో గౌరవ మర్యాదలు చేసి వారి ఆశీర్వాదాలు పొందేవారని మనం విన్నాం, అలాగే చదివాం. అలాంటి బ్రాహ్మణునికి ప్రస్తుత సమాజంలో, మన గౌరవ ప్రభుత్వాధినేతల నుండి కనీస ఆదరణ, గౌరవం లభించకపోవటం కడు శోచనీయం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పోల్చితే గతమే ఘనం అన్నట్లుగా ఉంది బ్రాహ్మణుని స్థితి... పరిస్థితి..
 
 
 
 ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కులపు ఓటు బ్యాంక్ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. ఎవరి కులం వారికి గొప్ప... నిజమే... తప్పు లేదు కానీ ఎదుటి కులాలను దూషించటం, శాసించటం అలాగే చిన్నచూపు చూడటం మాత్రం నిజంగా క్షమించరాని నేరం. వర్గ పోరు విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో స్వలాభం ఆశించి, స్వార్ధంతో వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే పట్టించుకొని తీరా అవసరం తీరాక వారి సంక్షేమాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి వివక్షకు గురవుతున్న వర్గాలలో బ్రాహ్మణ వర్గం ప్రధమస్థానంలో ఉంది. పేరుకే కులాల ప్రతిపాదనలో, ప్రాముఖ్యతలో బ్రాహ్మణునికి ప్రధమస్థానం కానీ ఆర్ధిక, సాంఘిక మరియు సామాజిక రంగాలలో అట్టడుగు స్థానంగానే ఉంది బ్రాహ్మణుని స్థితి... పరిస్థితి. చదువు, ఉద్యోగ అవకాశాల్లో సరియైన రిజర్వేషన్లు లేక, స్థిరమైన ఆదాయ పరిస్థితులు లభించక రోజురోజుకీ బ్రాహ్మణుల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారవుతుంది. నేటికీ నామినేషన్లు, పదవీ ప్రమాణ స్వీకారాలు వంటి తదితర విషయాలకై బ్రాహ్మణుల ఆశీస్సులు పొందే రాజకీయ నాయకులు వారి సంక్షేమం విషయంలో మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్ధం కాని భేతాళ ప్రశ్నలా మారింది. ఇకనైనా బ్రాహ్మణుల ఘోషను అర్ధం చేసుకుని అన్ని విషయాల్లోనూ వారికి సముచిత స్థానం కల్పించాలనేదే మా విన్నపం.
 
 
 
 
 బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
 
 తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం. మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: