వినేందుకు ఇది ఒకింత ఆశ్చ‌ర్య‌కరంగా ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గతంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఉద్యోగ సంఘాల నుంచి వ్య‌క్త‌మైన వ్య‌తిరేక‌త  అంద‌రికీ తెలిసిందే. దాదాపు రెండు టెర్మ్‌ల పాల‌న‌లో ఆయ‌న‌పై ఉద్యోగుల నుంచి వ్య‌తిర‌క‌త క‌నిపించింది. అది కూడా ప‌ని రాక్ష‌సుడు.. అని..ఆయ‌న‌నిద్ర‌పోడు.. త‌మ‌ను నిద్ర‌పోనివ్వడు .. అని బాబుపై ఉద్యోగులు ధ్వ‌జ‌మెత్తేవారు. ఇది పెద్ద సంక‌టంగా మారి.. చంద్ర‌బాబును త‌ర్వాత కాలంలో ప‌ద‌వికి దూరం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బాబు తాను మారిన మ‌నిషిన‌ని చెప్పుకోక త‌ప్ప‌లేదు. అయితే.. అది కేవ‌లం.. ఉద్యోగుల‌కు ప‌నివిష‌యం క‌లిగిన అసౌక‌ర్యమే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు న‌వ్యాంధ్ర పాల‌న‌లో ఉద్యోగుల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. వారు ఊహించ‌ని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి ఆదుకున్నారు. వారానికి ఐదు రోజుల ప‌నిని త‌గ్గించారు. అదేస‌మ‌యంలో హైద‌రాబాద్‌-టు అమ‌రావ‌తికి ప్ర‌త్యేకంగా వీకెండ్ల‌లో పాస్‌తో కూడిన బ‌స్సులు కేటాయించారు. ఇలా ఉద్యోగుల‌ను మ‌చ్చిక చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న విష‌యంలో చంద్ర‌బాబును మించి.. ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. జ‌గ‌న్‌పై కొన్నాళ్ల‌పాటు సానుభూతిగా ఉన్న ఉద్యోగులు.. ఇటీవ‌ల రెండు నెల‌ల కింద‌ట తెర‌మీదికి వ‌చ్చిన స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు.

అయితే.. ఇప్పుడు జ‌గ‌న్‌పై ఉద్య‌మించేందుకు రెడీ కావ‌డం.. స‌ర్వ‌త్రా విస్మ‌యానికి కార‌ణంగా మారింది. ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌గ‌న్‌.. ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. తాను అధికారంలోకి వ‌చ్చిన రెండు వారాల్లోనే ఉద్యోగుల‌కు ప్రాణ‌సంక‌టంగా మారిన సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తాన‌ని అన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. అదేస‌మ‌యంలో డీఏ పెంపు.. పీఆర్సీ అమ‌లు.. స‌హా ఇత‌ర విష‌యాల‌ను కూడా జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. దీంతో ఇప్పుడు ఉద్యోగులు ఆందోళ‌న బాట‌పడుతున్నారు. `క్విట్ సీపీఎస్` నినాదంతో చేప‌డుతున్న ఉద్య‌మానికి ఉద్యోగ సంఘాలు అన్నీ మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉంది.

జ‌గ‌న్ క‌నుక ఒక‌వేళ ఈ హామీని నెర‌వేర్చ‌క‌పోతే .. `క్విట్` జ‌గ‌న్ అనే నినాదం తెచ్చిన ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఉద్యోగ నేత‌లు చెబుతున్నారు.   ఇప్పటికే ఐదేళ్ల‌లో దాదాపు స‌గం ప‌రిపాల‌నా కాలాన్ని జ‌గ‌న్ పూర్తి చేసుకున్నారు. రానున్న రోజుల్లో వివిధ వ‌ర్గాల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక పోరాటాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌టి త‌ప్ప‌.. అన్ని ఉద్యోగ సంఘాలు ప్ర‌భుత్వ వైఖ‌రిప‌ట్ల సానుకూలంగా ఉండ‌గా.. ఉద్యోగుల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న ఒత్తిడితో సంఘాలు సైతం ఇప్పుడు జ‌గ‌న్‌పై ఉద్య‌మించేందుకురెడీ అవుతున్నాయి. మ‌రి దీనిని ఎలా క‌ట్ట‌డి చేస్తారో.. చూడాలి. ఇదే క‌నుక కొన‌సాగితే.. జ‌గ‌న్‌కు నైతికంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: