జపాన్ వాళ్లు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు. అక్కడ ఎక్కడైనా డబ్బు పడిపోతే అది పడిపోయిన చోటే ఉంటుంది. లేదంటే పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. మనం ఆధారాలు చూపించుకుని తీసుకురావచ్చు. జపాన్ లో 100కి 95వస్తువులు  ఇలాగే రికవరీ అవుతున్నాయట. చాలా రేర్ గా మాత్రమే మిస్ అవుతున్నాయట. అంత నిజాయితీగా ఉంటున్నారు అక్కడ వాళ్ళు.


ఈ విషయం ఇప్పుడు తాజాగా అధికారిక నివేదికల ప్రకారం కూడా తేలింది. టోక్యో పోలీస్ స్టేషన్ లో 30మిలియన్ డాలర్ల పోయిన డబ్బును వెనక్కి ఇవ్వగలిగారట. 28 మిలియన్ డాలర్లు 2009లో అయితే ఇప్పుడు అది 30 మిలియన్స్ డాలర్స్ ఇలా రికవరీ స్థాయి పెరిగిందంట. పర్సులు పోవడం, డబ్బులు పోవడం ఇలా అనమాట. 30 మిలియన్ డాలర్లు పోగొట్టుకుంటే 22 మిలియన్ డాలర్స్ వెనక్కి ఇచ్చారట అక్కడి పోలీసులు.


చెర్రీ బ్లోసమ్ సీజన్ సిచ్యువేషన్ అక్కడ నడుస్తుందట. అక్కడ ఎవరైనా దొరికిన సొమ్మును తిరిగివచ్చి ఇస్తే వాళ్లకి ఐదు నుండి 20% రివార్డు ఇస్తారట. ఆ సొమ్ములు ప్రభుత్వం దగ్గర ఉంటాయట. మూడు నెలల్లో గనక ఎవరూ ఆ సొమ్ముల కోసం సంప్రదించకపోతే ఆ డబ్బులు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగి అయితే గనుక ప్రభుత్వానికి వెళ్తాయట‌ ఆ సొమ్ములు. లేదా సామాన్య ప్రజలు కనుక సొమ్మును తీసుకు వస్తే మూడు నెలలు తర్వాత చూసి తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తారట.


ఇలాగ క్లైమ్ కానటువంటిది 13 మంది కలిసి ఇప్పుడు క్లైమ్ చేశారట అక్కడ. 76 వేల డాలర్స్ వాళ్ళకి చేరాయట. ఈ విధంగా నిజాయితీకి జపాన్ లో ఇలా రివార్డ్స్ ఇస్తారనే విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. దొరికిన సొమ్మును మనకే అనుకోకుండా ఇలా తిరిగిచ్చే నిజాయితీ అయితే ఎంతోమంది దగ్గర ఉండదు. అలాంటిది అక్కడ ప్రజల్లో ఇంత నిజాయితీ ఉండటం అది కూడా వాళ్ళు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా నిజాయితీని చూపించడం గొప్ప విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: