తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంది ఇస్లామిక్ మతస్థులు ఉన్నారు.. ఇక హైదరాబాద్ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అన్నీ మతాలు , కులాలు ఇంకా జాతులు వారు ఇక్కడ నివశిస్తూ కుల వృత్తుల తో పాటుగా సొంత బిజినెస్ లు చేసుకుంటున్నారు. అందుకే హైదరాబాద్ ను మహా నగరం అని అంటారు.. అన్నీ పండుగలు కూడా ఇక్కడే పుట్టాయి.. వివిధ రకాల పండుగలతో పాటుగా, వివిధ రకాల రుచులు కూడా ఇక్కడ లభిస్తాయి. తెలుగు వాళ్ళు, ముస్లింలు అన్న దమ్ములుగా కలిసి జీవిస్తారు. అందుకే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఆయింది.



ఇకపోతే ఇప్పుడు భాగ్యనగరం లో నివసించే కొందరు ముస్లింలకు తెలుగు కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జమాతె ఇస్లామీ హింద్‌ జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్‌ సాదతుల్లా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాచీన భాష అయిన తెలుగు వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలుగు రాయడం, మాట్లాడటం ప్రతీ ముస్లిం తప్పనిసరిగా నేర్చుకోవాలని పిలుపు నిచ్చారు..శుక్రవారం ఛత్తాబజార్‌ లోని జమాతె ఇస్లామీ హింద్‌ రాష్ట్ర కార్యాలయంలో 'తెలుగు వర్ణమాల', 'భాషణ' పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.



కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడటంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న జమాతె ఇస్లామీ హింద్‌ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జమాతె కార్యదర్శి ఖాలిద్‌ ముబష్షిర్‌, కోర్సు కోఆర్డినేటర్‌ అబ్దుల్‌ వాహెద్‌ మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా తాము నిర్వహిస్తున్న తెలుగు కోర్సులకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ముస్లిం ల కోసం తాము ప్రచురిస్తున్న పుస్తకాలకు మంచి స్పందన వస్తోందనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. తెలుగు ప్రజలకు మనకు మంచి అనుబంధం ఏర్పడింది.. వారితో మాట్లాడాలంటే తెలుగు పై ప్రావీణ్యం ఉండాలని కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: