వాస్తవానికి ఒక మిల్లి లీటర్ స్పెర్ం లో 20 మిలియన్ల వీర్య కణాలు ఉంటె అతను సంతాన ఉత్పత్తి బాగా ఉంటుంది అని అధికారులు తెలుపుతున్నారు. ఒక వేళా 15 మిల్లి లీటర్ల కన్నా తక్కువ వీర్యకణాలు ఉంటే,  వారిలో సంతాన ఉత్పత్తి చాన్సెస్ తక్కువ అన్నమాట. 


ఇలా వీర్య కణాలు తక్కువగా ఉండటానికి ముఖ్య కారణాలు గురించి తెలుసు కుందామా మరి.. ఒత్తిడి, ప్రోస్టేట్ గ్రంధిలో ఇన్ఫెక్షన్, బిగుతుగా ద్రయర్ వేసుకోవటం, బీజాలు దగ్గర వేడి ఎక్కువగా ఉండటం, స్టెరాయిడ్ ల వాడకం, సిగరెట్ అలవాటు, మందు ఎక్కువగా తాగటం వంటి  కారణాలు. 

 

ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని సూచనలు సలహాల గురించి తెలుసుకుందామా మరి... మాక రూట్, పనాక్స్ జిన్సెంగ్, అశ్వగంధ, వెల్లుల్లి ఇంకా చాల ఉన్నాయి.  వీటి  గురించి తెలుసుకుందామా మరి.

 

వీర్యకణాల సంఖ్య మరియు వాటి చలనాన్ని మెరుగుపరుస్తుందని 2013లో జరిపిన పరిశోధనలలో 675 మిల్లి గ్రాముల అశ్వగంధ సారాన్ని 90 రోజుల పాటూ, 3 వివిధ రకాల డోస్ లలో పురుషులకు ఇవ్వడం జరిగింది. కొన్ని నెలల పాటూ సగం చెంచా అశ్వగంధ పొడిని వేడి పాలలో కలుపుకొని తాగండి. మరొక మార్గం ఏమిటంటే- అశ్వగంధ వేరు సారాన్ని రోజు తీసుకోండి. 

 

సాధారణంగా  కామోద్దీపనలను చేయగల శక్తి వెల్లుల్లి బాగా ఉంటుంది మరియు వీర్య కణాల సంఖ్యను పెంచే విధానంగా కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం వీర్య కణాలకు ఒత్తిడిని తట్టుకుని, జీవించగల గుణాన్ని ప్రసాదిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగు పరచటమే కాకుండా , వీటిలో ఉండే సెలీనియం వీర్య కణాల చలనాన్ని కూడా పెంచుతుంది అని నిపుణులు తెలుపుతుంటారు.

 

ఇలా చాల ఉన్నాయ్ వాటి వివరాలు.. పుల్లటి పండ్లు, గోధుమలు, వాల్ నట్స్, గుడ్లు, దానిమ్మ, చేప, నత్త గుల్లలు, పాలు,  పాల ఉత్పత్తులు, డార్క్ చాక్లెట్, అరటి, బ్రోకలీ, ఆకుకూరలు ముఖ్యంగా బచ్చలి కూర,  కాలే, మొలకలు ఇవ్వని కూడా బాగా ఉపయోగపడుతాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: