ప్ర‌స్తుతం ఉన్న హైఫై లైఫ్‌లో ప్ర‌తి ఒక్క‌రు ఎంత ఫాస్ట్‌గా ఉంటున్నారో తెలిసిన విష‌య‌మే. ఇక యువ‌త అన్నిరంగాల్లోనూ ముందుంటున్న విష‌యం తెలిసిందే. నేటి యువ‌త పాశ్చాత్య‌సంస్కృతిని ఎక్కువ‌గా వంట‌బ‌ట్టించుకుంటున్నారు. దీనికితోడు పిల్ల‌లు పేరెంట్స్‌కి చ‌దువు, ఉద్యోగాలంటూ దూరంగా ఉండ‌డం. దీంతో స‌హ‌జీవ‌నాలు చేయ‌డం లాంటివి ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. గ‌తంలో ఇలాంటివ‌న్నీ ఎక్కడో వేరే దేశాల్లో జ‌రిగేవి. కానీ ప్ర‌స్తుతం అలా కాదు. మ‌న‌దేశంలోకి కూడా డేటింగ్ క‌న్నెప్ట్ వ‌చ్చేసింది. అయితే ఇలాంటి సంస్కృతి ఉన్న‌ప్ప‌టికీ కూడార పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనేవాళ్ళు ఉన్న‌ప్ప‌టికీ  చాలా మంది యువ‌త మాత్రం మ‌న సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నారని తాజాగా చేసిన స‌ర్వేలో తేలింది.

 

అవుట్‌లుక్‌-క్వారీ క‌లిసి ఈ స‌ర్వేను నిర్వ‌హించాయి. పెళ్లికి ముందే శారీర‌కంగా క‌లిసే దాని పై అభిప్రాయం అడ‌గ‌గా వాళ్లు ఆశ‌క్తిక‌ర‌మైన నిజాల‌ను తెలిపారు. పెళ్లికి ముందే అలాంటి వాటికి మేము దూర‌మంటూ 66 శాతం మంది మేము దానికి దూర‌మంటున్నారు. కేవ‌లం 20 శాతం మంది మాత్రం కావాల‌ని కోరుకుంటున్నారు. 2 శాతం మంది మాత్రం పెళ్లికి ముందు సెక్స్ మాకు సమ్మతమేనని అయితే త‌ర్వాత ఆ వ్య‌క్తే భాగ‌స్వామి కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. 

 


పోర్న్ వెబ్‌సైట్లు యువతను పాడు చేస్తున్నాయని, వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని 50 శాతం మంది అంగీక‌రించారు. అంటే వాటిని చూస్తూ యువ‌త ఎక్కువగా భావోద్వేగాల‌కు లోన‌యి కంట్రోల్ చేసుకోలేక ఇలాంటివ‌న్నీ జ‌రుగుతున్నాయ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని 50 శాతం మంది అంగీకరించారు.కాగా, కులాంతర, మతాంతర వివాహాలకు 57 శాతం మంది వ్య‌తిరేకిస్తున్నారు. ఇలాంటి వివాహాల వ‌ల్ల ముందు కాస్త బాగానే ఉన్నా ఏదైనా క‌ట్టుబాట్లు పాటించే టైంలో ఎలాగైనా కాస్త తేడాగానే ఉంటుంది. ఒక్కొక్క‌రిది ఒక్కోర‌క‌మైన ఆచార‌వ్య‌వ‌హారాలు ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: