ఈ తరం యువతకు శ్రమ అంటే ఏంటో తెలీదు.. అప్పట్లో ఏదైనా సాధించాలి అంటే రాత్రిపగుళ్ళు కష్టపడి శ్రమించేవారు.. ఒక పని కోసం అహర్నిశలు కష్టపడి.. ఎన్ని సమస్యలు వచ్చిన సరే అది సాధించేవరకు శ్రమిస్తూనే ఉండేవారు. కానీ ఇప్పటి యువత ఏదైనా చిన్న కష్టం వచ్చింది అంటే చాలు.. ఆ లక్ష్యాన్ని వదిలేస్తారు. 

 

మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే.. అది ఛేదించే వరుకు ఆలసి పోకూడదు.. ఎంత కష్టం అయినా సరే ఎదిరించి ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. కష్టం వచ్చింది అని వెనకడుగు వేస్తే ఎన్ని జన్మలు ఎత్తిన విజయం సాధించలేవు.. ఒకసారి ఓడిపోయినా మళ్ళి మళ్ళి ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 

 

కొంచం కష్టమే అవుతుంది.. కానీ ప్రయత్నంలో తప్పులేదు కదా.. ఏదైనా ప్రయత్నంతోనే సాధ్యం.. ప్రయత్నం కాస్త శ్రమ అవ్వాలి.. అప్పుడే విజయం సాధిస్తాం.. లేకుంటే కష్టాలు తప్పక పడాలి. అప్పుడే లక్ష్యాన్ని ఛేదించాలి.. అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది.. తప్పక పాటించండి.. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: