వెజిటబుల్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.. కానీ, ఇప్పుడు వెజిటబుల్స్ తో తయారు చేసిన పిండి తో కూడా అంతే ఆరోగ్యం ఉందని నిపుణులు అంటున్నారు. ఏ కూరగాయలతో చేసిన పిండిని తీసుకోవడం మంచిదో ఇప్పుడు చూద్దాం.. పిండి అనగానే మనకు గుర్తొచ్చేది శనగ పిండి, జొన్నపిండి ఇకపోతే రాగి పిండి ఇలా విని ఉంటారు .. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయల పిండి కూడా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.. వాటిని తీసుకోవడం మంచిది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 



తాజా కూరగాయాలను కొని ఎండబెట్టిన తర్వాత వాటిని గ్రైండ్ చేస్తే కూరగాయల పిండి వచ్చేస్తుంది. రుచితో పాటు పోషకాల కోసం చూసే వారికి ఇవి చక్కటి ఆహారాలుగా చెప్పవచ్చు. కూరగాయలలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు కూడా ఈ పిండి ద్వారా మన శరీరానికి అందుతాయి.



క్యారెట్ పిండి

క్యారెట్లు అధిక న్యూటియన్లతో పాటు ఫైబర్ కలిగిన ఆహారం అని మనకు తెలిసిందే కదా. అలాగే .. క్యారెట్ పిండి కూడా విటమిన్-ఎ, బి లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి రకరకాల మినరల్లు కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల కంటి చూపు మెరుగవడం, రోగనిరోధక శక్తి పెరగడం, రక్త ప్రసరణ బాగా జరగడం, ఆక్సీకరణ వంటి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు..


బీట్ రూట్ పిండి

బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి కాయలతో పిండిని చేసుకొని తింటే మంచిదని అంటున్నారు..బీట్ రూట్ పిండిలో ప్రొటీన్లు, విటమిన్-బి6, ఫొలేట్, పొటాషియం లాంటి చాలా రకాల న్యూట్రియన్లు ఉంటాయి. డైట్ లో ఉన్నవారు కూడా వీటితో చేసిన ఆహార పదార్థాలను తినొచ్చు. ఇది శరీరంలో బీపీని కంట్రోల్ చేయడం, బ్రెయిన్ పవర్ ను పెంచడం, శారీరక చురుకుదనాన్ని మెరుగుపరచడం, నొప్పి, మంట లాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించడం లాంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పిండి వల్ల అధిక బరువును తగ్గవచ్చు, అలాగే కాలేయ సమస్యలు కూడా తగ్గిపోతాయి.. 


ఇవే కాకుండా పనసపండు, బ్రోకలీ ఆకులతో కూడా పిండిని తయారు చేసి వాడుకోవచ్చు.. వీటిని వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: