ఈ మధ్యకాలంలో చిన్న పెద్దాడ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జుట్టుకు రంగు వేస్తున్నారు. అయితే రంగుల కంటే హేన్నానే మంచి ఫలితం ఇస్తుందని చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. హెన్నా జుట్టు రంగును ఎరుపు గోధుమ రంగులోకి మారుస్తుంది.సరిగా అప్లై చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. హెన్నా జుట్టుకు సహజంగా లభించేటువంటి వాటిలో ఒకటని చెప్పవచ్చు. ఇందులో కెరటిన్ ప్రోటీన్ ఉండడంవల్ల జుట్టును చాలా బలోపేతం చేస్తుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. జుట్టుకు హెన్నాను పోయడానికి అవసరమైన సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి.


మనం హెన్నాను కేవలం మూడు గంటల సేపు వరకు ఉంచితే జుట్టు గోధుమ రంగులోకి మారుతుంది. ఒకవేళ హెన్నా జుట్టును ఆరడానికి సమయం దాన్ని కలిపే విధానం పైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.. హెన్నా రంగు గోరువెచ్చని నీటిని హెన్నా కలపడం మంచిది. హెన్నా ను ఉపయోగించుకోవడానికి కొన్ని గంటలపాటు ముందే బాగా కలిపి ఉంచాలి. జుట్టుకు పట్టించిన తర్వాత హెన్నా ను ఎంతసేపు ఉంచితే.. అంతగా లాసోన్ అణువులు కెరటిన్ లోకి వెళ్లి లోతైన రంగును కనబరుస్తాయి.


సాధారణంగా హెన్నా ప్రయోజనం బాగా కలగాలంటే సరిగ్గా ఐదు గంటల పాటు జుట్టుకు పట్టించి వదిలేయాలి. హెన్నా మిశ్రమాన్ని మీ జుట్టు పైన ఎక్కువ సేపు ఉంచితే.. పొడిగా తయారవుతుంది దీనివల్ల తలలో మంట కూడా వస్తూ ఉంటుంది. ఈ రంగు దాదాపుగా రెండు నెలల వరకు ఉంటుంది. హెన్నా  పూర్తిగా జుట్టుకి బాగా అప్లై చేయాలి అంటే వేరు వేరు చేసి పలు బాగాలలో హెన్నా ను పట్టించాలి. అంతేకాకుండా అలా పట్టించిన తర్వాత ఏదైనా గుడ్డతో గట్టిగా కట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే స్నానం చేసేటప్పుడు బయట ఉష్ణోగ్రత బట్టి ఎంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: