దర్శకుడు కావాలని సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరో అయ్యారు. ఆయన సినిమాల్లో అరంగేట్రం చేయకముందు 52 షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. తన మొట్టమొదటి సినిమా అయిన "ఉయ్యాలా జంపాల" కి స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ కూడా రాసారు. సినిమా చూపిస్తా మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ఆ తరువాత చాలా సినిమాలు చేశారు. ఐతే వాటిలో కొన్ని హిట్స్ కాగా మరికొన్ని డిజాస్టర్స్ అయ్యాయి. ఆ కాలంలోనే ఆయన చేస్తున్న అన్ని సినిమాలు కూడా ప్లాప్ అవుతున్నాయి.


సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాజ్ తరుణ్ పవర్ ప్లే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ అది కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయన కెరియర్ గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయింది. అయితే చాలా సహజంగా నటించే రాజ్ తరుణ్ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారని అభిమానులు తరచూ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆయన తన అభిమానులతో ముచ్చటించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా మీ ప్రశ్న మా జవాబు అనే ఒక సీజన్ నిర్వహించారు.


అయితే నెటిజన్లు రాజ్ తరుణ్ ని రకరకాల ప్రశ్నలు అడిగారు. అరియనా గురించి కూడా అతన్ని అడగగా ఆమె అమేజింగ్ అని సమాధానమిచ్చారు. ఫోన్ నెంబర్ కావాలి అని కొంతమంది అడగగా.. "నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టు" అంటూ శివమణి నెంబర్ ఇచ్చారు. అయితే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని మళ్లీ నెటిజన్లు ప్రశ్నించగా అది తన నెంబర్ కాదని రిప్లై ఇచ్చారు. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నలకు.. అలాంటివేమీ లేవు అని తాను సమాధానమిచ్చారు.


అయితే ఒక నెటిజెన్ ఏకంగా ఆర్ యూ వర్జిన్ అని ప్రశ్నించాడు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మీరేమనుకుంటున్నారు అని రాజ్ తరుణ్ ఎదురు ప్రశ్నించారు. మళ్లీ మరొక నెటిజన్ మీరు వర్జినా? అని ప్రశ్నించాడు. దీంతో అంత ఆత్రం పనికిరాదని రాజ్ తరుణ్ కౌంటర్ ఇచ్చారు. ఐతే ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? అని ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: