మెగాస్టార్ సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత వరసగా సినిమాలు ఒప్పుకుంటు దూసుకెళ్తున్నారు. ఆయన డైరెక్టర్స్ ని ఎంచుకునే విధానం చాలా కొత్తగా ఉంది. ముందుగా శివ కొరటాల తో ఆచార్య సినిమా పూర్తి చేసిన చిరు వెంటనే మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాథర్ సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో భూల శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే కాకుండా బాబీ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు మెగాస్టార్ . ఇవే కాకుండా మారుతి డైరెక్షన్ లో మెగాస్టార్ ఒక సినిమా చేస్తున్నారు అని టాక్ నడుస్తుంది. అయితే ఆయన ఒప్పుకున్న సినిమాలు అన్ని మాస్ అయితే మారుతి మెగాస్టార్ స్టైల్ ని మారుస్తున్నాడు. మెగాస్టార్ చిరు సినిమాల్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటైన శంకర్ దాదా యమ్ బి బి ఎస్ సినిమాలో ఆయన కామెడీ యాంగిల్ ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు మారుతికామెడీ ని మళ్ళీ బయటకి తీస్తున్నాడు అని టాక్. చిరు తో ఒక మంచి కామెడీ సినిమాకి మారుతి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

మారుతి సినిమాల్లో బాగా వర్క్ ఔట్ అయ్యేది కామెడీ నే. ఇక ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో చిరు ని ఊహించుకొని ఫాన్స్ ఆనందపడిపోతున్నారు.ఇక మెగాస్టార్ ప్రస్తుతం భోళా శంకర్ , గాడ్ ఫాథర్ సినిమాల షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. మారుతి కూడా గోపిచంద్ తో పక్క కమర్షియల్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మారుతి మెగాస్టార్ ప్రాజెక్ట్ మీద కూర్చుంటాడు అని టాక్. ఎలాగో చిరు డేట్స్ వచ్చే ఏడాది వరకు ఖాళీగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: