నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, నూతనంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులను మీడియా పలుకరించింది. మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నా బిడ్డ ఎంపిక కావడం చాల సంతోషం అని అన్నారు. నా బిడ్డని శ్రీ వేంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, షిరిడి సాయి నాథుడు దీవెనలతో పాటుగా అసోసియేషన్ సభ్యుల దీవెనలతో ప్రెసిడెంట్ గా గెలుపొందాడు అని ఆయన హర్షం వ్యక్తం చేసారు.
ఎంతో బాధ్యతతో కూడిన గౌరవ ప్రదమైనది మా అధ్యక్ష పదవి అని అన్నారు ఆయన. గౌరవానికి ఎలాంటి భంగం రాకుండా నా బిడ్డ పరిపాలన చేస్తాడు అని స్పష్టం చేసారు. ఇక మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా మీడియాతో మాట్లాడారు. మా ఎన్నికలు అయినా అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాము అని చెప్పారు. ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరు కృషితోనే గెలుపు సాధ్యం అయింది అని ఆయన వెల్లడించారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నాం అని అన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేసినట్లు మీడియా ముఖంగానే మాకు తెలిసింది అని వారి రాజీనామా లేఖలు వచ్చాక వాటిపై స్పందిస్తా అన్నారు మంచు విష్ణు.