ఉప్పెన అనే  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి ప్రస్తుతం హై స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ అమ్మడి ముంగిట వరుస  అవకాశాలు వచ్చి వాలి పోతున్నాయి. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఈ అమ్మడు అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం గమనార్హం. క్యాలిక్యులేటర్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు  బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కింది ఉప్పెన సినిమా. ఇక ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. ఇక వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


 ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఇక ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది. ఈ అమ్మడికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా చిత్ర పరిశ్రమలో బాగా కలిసి వచ్చింది. ఇప్పటికే నాని, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే నాని సినిమాలో లిప్ కిస్ కూడా పెట్టి  తన లిమిటేషన్స్ ను చెరిపేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.


 ఇప్పటికే ఉప్పెన సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల జి స్టూడియోస్ సంస్థతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే సుష్మిత కొణిదెల నిర్మించబోయే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ కోసం కృతి శెట్టి ని సంప్రదించారట చిత్ర బృందం. ఇదే కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు సైన్ కూడా చేసిందట ఈ ముద్దుగుమ్మ. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధం కావడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: