జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రెస్ మీట్స్ తో బిజీ అవుతోంది త్రిబుల్ ఆర్ టీం. ఇక ఈ రోజు తెలుగు మీడియా ముందుకు వచ్చిన ఈ సినిమా యూనిట్ తమ అనుభవాలను మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా సినిమాలో ఉన్న అన్ని రకాల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొమరం భీమ్ అయిన ఎన్టీఆర్ పులితో పోరాడే సన్నివేశం ఉంటుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో ఆ సన్నివేశం కూడా చాలా హైలెట్గా నిలిచింది. అయితే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో రిపోర్టర్ ఈ సీన్ కు సంబంధించి ప్రశ్న అడిగాడు. సినిమాలో టైగర్ కి మీరు భయపడ్డారా లేదా ఆ సీన్ లో రాజమౌళి గారు మిమ్మల్ని భయపెట్టారా అని అడిగినప్పుడు, దానికి జూనియర్ ఎన్టీఆర్ బదులిస్తూ..' నిజానికి ఆ సన్నివేశంలో పులి లాగా గర్జించింది రాజమౌళి గారు. ఇక తెలిసిన పులి కాబట్టి నేను కూడా ఒక అరుపు అరిచాను' అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. అంటే ఎన్టీఆర్ చెప్పినదాన్ని బట్టి గ్రాఫిక్స్ చేయడం కంటే ముందు రియల్ లొకేషన్లలో టైగర్ గా కనిపించి అరిచింది రాజమౌళి గారి అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో అడవి నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్గా ఉంటాయని ముఖ్యంగా పులి కి సంబంధించిన సీన్ కూడా ఆకట్టుకుంటాయని అర్థం అవుతోంది. సాధారణంగా రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా అందులో హీరోల పాత్రను అంతకుమించి అనేలాగా చూపిస్తూ ఉంటాడు.ఈ సినిమాలో ఇద్దరు హీరోలను కూడా అదేవిధంగా చూపించబోతున్న ట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను దానయ్య సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR