ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట మూవీ మేనియా స్పష్టంగా కనబడుతుంది. భరత్ అనే నేను ,  మహర్షి , సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ నిన్న అనగా మే 12 వ తేదీన సర్కారు వారి పాట సినిమా భారీ ఎత్తున చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఎంతో గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాకు మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది.  

అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకు మంచి టాక్ లభించడం,  రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ప్రభుత్వాలు ఈ సినిమాకు కల్పించడంతో సర్కారు వారి పాట సినిమాకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సర్కారు వారి పాట సినిమా 'ఓ టి టి'  హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు , అలాగే సర్కారు వారి పాట మూవీ జూన్ రెండవ వారం లేదా జూన్ మూడవ వారం నుండి అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: