నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా దీనికి ప్రేక్షకుల దగ్గర నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.  బాలయ్య సినిమాల తరహాలోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది అని దీనిని బట్టి చెప్పవచ్చు. భారీ డైలాగులకు మాస్ డైలాగులకు పెట్టింది పేరైన నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో చెప్పిన డైలాగులు ఎంతో అమోఘం గా ఉన్నాయని ఈ సినిమా నుంచి వచ్చిన రెండు మూడు డైలాగులను బట్టి చెప్పవచ్చు.

ఆ విధంగా బాలకృష్ణ సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసిన ఈ గ్లింప్స్ తరువాత ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడసాగారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ చిత్రాన్ని కూడా బాలయ్య అభిమానులకు ఏమాత్రం తగ్గని విధంగా తెరకెక్కించడం విశేషం. బాలయ్య ఈ సినిమాలో కనిపించిన తీరు ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా ద్వారా బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం ఖాయమని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్ కు వచ్చిన దగ్గరనుంచి ఇది కన్నడ సినిమా లో తెరకెక్కిన మఫ్టీ సినిమాకు రీమేక్ అని అంటున్నారు మరి ఇది ఇది సొంత కథతో చేసిన సినిమానా లేక రీమేక్ సినిమా అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణసినిమా చేయబోతున్నాడు. ఈమధ్యే అధికారిక ప్రకటన వచ్చింది కూడా.  ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో ఘన విజయాన్ని అందుకొని తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమాపై మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: