మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా దర్శకుడు హరికి చాలా మంచి పేరు ఉంది. హీరో సూర్యతో ఆయన తీసిన 'సింగం' సిరీస్ తమిళ్ లో ఏమో కానీ తెలుగులో ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఈ సిరిస్ తెలుగులో అయితే జనాలని చాలా బాగా ఆకట్టుకుంది. అయితే, ఈ తమిళ మాస్ డైరెక్టర్ హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలనీ వుంది. ఆ మధ్య బాలయ్య బాబుతో హరి సినిమా ఫిక్స్ అయ్యింది అని రూమర్స్ కూడా వినిపించాయి. ఆ రూమర్స్ కి తగ్గట్టుగానే హరి కూడా బాలయ్య కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశాడు.కానీ.. అప్పుడు హరి చెప్పిన కథ బాలయ్యకి నచ్చలేదు. దాంతో హరి - బాలయ్య కలయికలో అప్పుడు సినిమా స్టార్ట్ కాలేదు. ఇక ఇప్పట్లో హరి డైరెక్ట్ తెలుగు సినిమా చెయ్యడు అనే టాక్ కూడా చాలా బాగా ప్రచారం జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఇప్పుడు హరి తెలుగు సినిమా పట్టాలెక్కబోతుంది. హీరో రానా ఇంకా దర్శకుడు హరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ఈ కథనే బాలయ్యకి చెప్పారు హరి హరి.కానీ బాలయ్యకి ఈ కథ అస్సలు నచ్చలేదు.


ఆ తర్వాత హరి.. బన్నీకి కూడా ఈ కథ వినిపించాడు. విచిత్రంగా ఈ కథ బన్నీకి బాగా నచ్చింది. కానీ.. అప్పుడు డేట్లు ఇవ్వలేని పరిస్థితి. కారణం.. బన్నీ సినిమాల లైనప్ అనేది చాలా పెద్దగా వుంది. ఇక బన్నీ డేట్స్ రావడానికి మూడేళ్ళు సమయం పడుతుంది. ఇదే విషయాన్ని హరికి కూడా చెప్పారు బన్నీ. అయితే హరి ఇక వెంటనే తెలుగు సినిమా చేయాలని వుందని మరో హీరోతో ఈ సినిమా చేస్తాను. మనం మళ్లీ మరో సినిమా కలిసి చేద్దాం' అంటూ పక్కకి వచ్చాడు హరి.ఇక అలా పక్కకి వచ్చిన హరి వెంటనే ఈ కథని రానాకి చెప్పారు.రానాకి కథ బాగా నచ్చింది. చివరికి కాంబినేషన్ ఫైనల్ అయ్యింది. రానాకి కొంచెం మాస్ ఇమేజ్ వుంది. అందుకే ఈ కథ రానా ఇమేజ్ కి కూడా పక్కాగా సరిపొతుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది.ఒక్క హిట్టు కోసం ఆరాటపడుతున్న రానాకి కెరీర్ పరంగా హరి సినిమా హిట్ ఇస్తుందని ఆశపడుతున్నాడు. రానా హీరోగా ఈమధ్య వచ్చిన విరాట పర్వం సినిమా చాలా దారుణంగా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: