మహేష్ బాబు సినిమా కెరియర్లు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన సినిమా ఒక్కడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ని మార్చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా 2003 లో విడుదలవ్వడ జరిగింది. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు లను సైతం సృష్టించింది. అంతేకాకుండా డైరెక్టర్ గుణశేఖర్ కూడా అప్పట్లో మంచి స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత మరికొన్ని మాస్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమయ్యాడు మహేష్ బాబు.


అయితే ఇలాంటి సినిమా మహేష్ బాబు కెరియర్ లో మళ్ళీ రాలేదని చెప్పవచ్చు ఈ సినిమా సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. దీంతో అప్పుడే అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు కానీ ప్రస్తుత పరిస్థితులలో మహేష్ బాబు ఆ నిర్మాత ఒక్కడు లాంటి సినిమా చేస్తాడా అని విషయం అందరిలోనూ సందేహాన్ని కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న మరొక వార్త ఏమిటంటే నిర్మాత ఎమ్మెస్ రాజు ఒక్కడు సినిమా సీక్వెల్ ను తప్పకుండా నిర్మించాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.


అయితే సేమ్ క్యాస్ట్ తో కాకుండా ఇతర నటీనటులతో టెక్నీషియన్స్తో ఒక్కడు -2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. కానీ నిర్మాత ఎమ్మెస్ రాజు మాత్రం ఈ సినిమా తో మళ్లీ చాలా స్ట్రాంగ్ గా నిలదొక్కుకోవాలనుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఆ ప్రాజెక్టును పాన్ ఇండియా లేవాళ్లు తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.మరి ఈ ప్రణాళిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: