దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అలనాటి కాలంలో ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మాత్రం అలాంటి మ్యాజిక్ ను తన మూవీ లతో చేయలేక పోతున్నాడు . కాకపోతే రామ్ గోపాల్ వర్మ హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలు మాత్రం చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా సముద్ర ఖని ,  అజయ్ దేవ్ గన్ , శ్రేయ ప్రధాన పాత్రలలో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ తనకు సర్కస్ ల అనిపించింది అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశాడు. సర్కస్ చూసినప్పుడు అలాంటి ఆనందం మరియు ఆసక్తి కలుగుతుందో ఆర్ ఆర్ ఆర్ మూవీ ని చూసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ కలిగినట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పు కొచ్చాడు. వంతెన దగ్గర బాలుడు ని కాపాడిన సన్నివేశంలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ జెమినీ సర్కస్ చేసినట్లుగా తనకు అనిపించిందని ఓ ఇంటర్వ్యూ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను కొల్ల గొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: