టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ యంగ్ హీరోయిన్ అయినటువంటి కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేతికా శర్మ , ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ లోనే తన అంద చందాలను ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది.  

మంచి అంచనాల నడుమ విడుదల అయిన రొమాంటిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ లక్ష్య మూవీ లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేకపోయినప్పటికీ నటన , అందచందాలు పుష్కలంగా ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు ప్రేక్షకుల్లో మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

పంజా వైష్ణవ తేజ్ ఈ మూవీ లో హీరోగా నటించిన గిరిశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ కి చిత్ర బృందం ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు దక్కడం లేదు. ఇలా అదిరిపోయే అవకాశాలు కేతికా శర్మ కి వస్తున్నప్పటికీ సరైన విజయం మాత్రం ఈ ముద్దుగుమ్మకు బాక్సా ఫీస్ దగ్గర లభించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: