
ఇక్కడ భారీ పాపులారిటీ అందుకున్న ప్రియా భవాని శంకర్ ఆ తర్వాత వైభవ్ రెడ్డికి జోడిగా 2017 లో వచ్చిన మేయాధ మాన్ తో సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు ఈ సినిమాలో నటించినందుకు ఉత్తమ మహిళ నూతన నటిగా సైమా అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రియా భవాని శంకర్ .. కార్తీతో కలిసి కడైకుట్టి సింగం లో నటించింది.. ఆ తర్వాత మాన్స్టర్ తో పాటు మరెన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈమె కేవలం సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది . 2020లో టైం ఎన్నా బాస్ అనే వెబ్ సిరీస్ లో డాక్టర్ భారతి పాత్రలో నటించిన ఈమె.. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
మరొకవైపు బాధితుడు అనే వెబ్ సిరీస్ లో పవిత్ర క్యారెక్టర్ పోషించగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరొకపక్క ఇండియన్ టు సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇకపోతే ఈరోజు ఆమె పుట్టినరోజు కాబట్టి ఆమె గురించి ఆమె కెరియర్ గురించి తెలియని ఈ విషయాలు మీ కోసమే. 1989 డిసెంబర్ 31వ తేదీన జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు 32వ పుట్టినరోజు జరుపుకుంటోంది.