బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మైత్రి మూవీ సంస్థ ఈ మూవీ ని నిర్మించింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని రేపు అనగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఇప్పటికే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది. అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చింది.

మూవీ యొక్క టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 రూపాయల వరకు పెంచుకునే వేసులు బాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులు బాటు సినిమా విడుదల అయిన తొలి 10 రోజులు మాత్రమే వర్తిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. మరి టికెట్ ధరల పెంపుతో వీర సింహా రెడ్డి మూవీ కి మంచి కలెక్షన్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: