దిగ్గజ దర్శకుడు, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కే విశ్వనాథ్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు తెరకు అందించడమే కాదు తెలుగు చిత్రాన్ని భారత ప్రభుత్వం చేత ఆస్కార్ కి పంపించే అంత గౌరవాన్ని తీసుకొచ్చారు అంటే ఆయన సినీ పరిశ్రమ కోసం ఎంత కష్టపడి పని చేశారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు నిన్న చనిపోయే వరకు కూడా ఆయన సినిమాలో పాటలను అందించడానికి కొన్ని అద్భుతమైన పాటలను కూడా రాసారట. అలా పాటలు రాస్తూ..రాసిన పాటలు వింటూనే శివైక్యం అయ్యారు.ఇక్కడ చింతించాల్సిన మరొక విషయం ఏమిటంటే.. జాతీయ అవార్డులను , పద్మశ్రీ అవార్డులను అందించిన శంకరాభరణం సినిమా 1980 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. ఈ సినిమా దర్శకుడు కే విశ్వనాథ్ కు మంచి గుర్తింపు అందించింది. అలాంటి రోజే ఆయన మరణించడం నిజంగా బాధాకరం

ఇదిలా ఉండగా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా, సౌండ్ ఇంజనీర్ గా,  దర్శకుడిగా తన సినీ కెరియర్లో ఎన్నో రకాలుగా పనిచేసి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన ఈయన ఆస్తులను కూడా బాగానే పోగు చేశారని సమాచారం.. హైదరబాద్ జూబ్లీహిల్స్ లో రూ.12 కోట్ల విలువైన ఇల్లు ఆయన సొంతం .. అలాగే హైదరాబాదు శివారులలో కూడా సుమారుగా కొన్ని రూ.కోట్ల విలువ చేసే 8 ఎకరాల పొలం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా స్థిర చర ఆస్తులు కలిపి దాదాపుగా రూ. 150 కోట్లకు పైగానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కళాతపస్వి కే విశ్వనాథ్ కు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు.. తండ్రి మరణంతో వీరి వారసులు మరింత దిగ్బ్రాంతికి గురి అవుతున్నారు.  ఇప్పటికే సినీ ప్రముఖులు కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: