
కథ : వివేక్ (సంజయ్), ఊర్వశి పరదేశి (సిరి). వీరిద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంట. హ్యాపీగా సాగుతున్న సమయంలో సిరిని ఎవరో హత్య చేశారు. ఆ తరువాత సిరికు సంబంధించిన వారందరూ హత్యలకు గురవుతుంటారు. ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. ఆసక్తికరమైన పరిస్థితులు సృష్టించారు. ఒక దశలో ఎవరు ఎవరిని ఎందుకు చంపారో అర్థం కాని పరిస్థితి. ఈ హత్యలకు సంజయ్ స్నేహితుడు సుదేశ్ (శరత్)కు సంబంధం ఏంటి? అతను కూడా ఎందుకు హత్య గావించబడ్డాడు? సంజయ్ మేనేజర్ మరియు సంజయ్ ను ఇష్టపడ్డ ప్రగ్య నయన్ ( శిల్ప) పాత్ర ఏంటి? హత్యలవెనుక ఉన్న సీక్రెట్‌ను పోలీసులు ఎలా ఛేదించారనేదే కథ.
విశ్లేషణ: మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. డైరెక్టర్ మధు సూదన్ ఇలాంటి కథతో ఆడియెన్స్ ను థ్రిల్లింగ్ కు గురిచేసే ప్రయత్నం చేశారు. ఓ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ చుట్టూ కథ తిరుగుతూ థ్రిల్ కి గురి చేస్తుంది. వరుస హత్యలు.. దాని వెనక వున్న వ్యక్తులను ఛేదించే వ్యూహం ఇంట్రస్టింగ్‌గా సాగుతాయి.
నటీనటుల నటన:
సంజయ్ గా వివేక్ మెచ్యూర్డ్ నటన కనబరిచాడు. పాత్రలో పరకాయప్రవేశం చేసాడు. సంజయ్ భార్య గా ఊర్వశి బాగా నటించింది. ఇక పోలీస్ ఆఫీసర్ సత్య గా అజయ్ నటన హైలెట్. మరో పోలీస్ పాత్రలో నటించిన దుర్గ (జ్ఞానేశ్వరి) కూడా బాగా చేసింది. హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ తిరందసు (రవి), కిరీటి, హీరోయిన్ తల్లిగా ప్రియ పాత్రల మేరకు నటించారు. రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యాంగార్, శుభలేఖ సుధాకర్ చిన్న పాత్రలే అయినా పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్ మధుసూధన్ కిది తొలి సినిమా అయినప్పటికీ మంచి కథ, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నారనే చెప్పాలి. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకున్నారు. జి. వి అజయ్ తన కెమెరా పనితనాన్ని చాటారు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ ఓకే. భరత్ మంచిరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథను ఎలివేట్ చేసింది. సహస్ర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. సస్పెన్స్ తో సాగే ఉత్కంఠ భరితమైన కథనం అలరిస్తుంది.
రేటింగ్:3/5