హీరో రాజశేఖర్ వేసే ప్రతి అడుగులోను అతడి భార్య జీవితా రాజశేఖర్ అందించే ప్రోత్సాహ సహకారాలు ఉంటాయి అన్నది ఓపెన్ సీక్రెట్. గత కొన్నిసంత్సరాలుగా వరస పరాజయాలతో సతమతమైన రాజశేఖర్ ‘గరుడవేగా’ సినిమాతో తిరిగి సక్సస్స్ బాట పట్టాడు. అయితే ఆ సినిమా సక్సస్స్ ను అందించినా రాజశేఖర్ కు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు.

దీనితో మరింత పట్టుదలతో రాజశేఖర్ ‘కల్కి’ సినిమాలో నటించి ఆసినిమాను ప్రమోట్ చేస్తూ ఆమూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో జీవిత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాజశేఖర్ ను ప్రేమించే రోజులలో తమ పెళ్ళికి ఎదురైనా సమస్యల గురించి అప్పటికే రాజశేఖర్ కు కుదిరిన ఒక పెళ్లి సంబంధం గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. 

అప్పట్లో రాజశేఖర్ తాను ప్రేమిస్తున్న సంగతి ఇండస్ట్రీ అంతా తెలిసిపోయిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తనతో రాజశేఖర్ తన ప్రేమను కొనసాగిస్తున్నా తన తల్లి తండ్రులు తమ పెళ్ళికి ఒప్పుకుంటేనే తమ పెళ్లి జరుగుతుంది అని కండిషన్ పెట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. అయితే అప్పటికే తమ పెళ్ళికి అంగీకరించని రాజశేఖర్ తల్లి తండ్రులు ఒక సంపన్న కుటుంబానికి చెందిన ఒక అమ్మాయితో పెళ్లి కుదిర్చిన విషయాలను బయటపెట్టింది. 

దీనితో రాజశేఖర్ ఏమిచేయలేక తనతో తమ ప్రేమను మర్చిపోయి కేవలం స్నేహితులుగానే ఉందాము అని చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ రాజశేఖర్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తమ ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమ వ్యవహారాన్ని పసిగట్టి వివరాలు అడిగినప్పుడు రాజశేఖర్ పూర్తి నిజాలు చెప్పడంతో షాక్ అయిన ఆ అమ్మాయి భవిష్యత్ లో జీవితతో ఏసినిమాలలోను నటించకూడదని అదేవిధంగా కనీసం జీవితతో మాట్లాడ కూడదని కండిషన్స్ పెట్టిన సందర్భాన్ని జీవిత గుర్తుకు చేసుకుంది.  ఆ కండిషన్స్ రాజశేఖర్ కు నచ్చక పోవడంతో తన తల్లితంద్రులును ఒప్పించి సుమారు రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత తనను పెళ్ళి చేసుకున్న అప్పటి విషయాలను ఇప్పుడు జీవిత బయటపెట్టింది. దీనితో తన లవ్ స్టోరీలో సినిమా స్టోరీని మించిన ట్విస్ట్ లు ఉన్నాయి అంటూ జీవిత తమ ప్రేమ వివాహం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: