సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ జరగని విధంగా రసవత్తరంగా జరిగింది. కంటెస్టెంట్స్ అందరినీ ఇద్దరిద్దరుగా డివైడ్ చేసి అవతలి వారి కంటే తాము ఏ విషయాల్లో బెటరో, టైటిల్ గెలవడానికి తమకున్న అర్హతలేంటో చర్చించాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అయితే అంత సీరియస్ టాస్క్ ని కంటెస్టెంట్స్ కామెడీ చేశారని అనిపిస్తుంది. ఒక్కోసారి వీళ్ళు గేమ్ ఆడడానికే వచ్చారా అనే అనుమానం కలుగక మానదు.


నామినేషన్ టైంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులని ఒకసారి విశ్లేషిస్తే, మొదటగా బాబా భాస్కర్ పునర్నవిలలో పునర్నవి కంటే బాబాకే ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి. అయినా బాబా భాస్కర్ ఆ విషయాలను వెల్లడించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. పునర్నవికి పెద్దగా పాజిటివ్ పాయింట్స్ లేనప్పటికీ, ఆమె వాదన బలంగా వినిపించింది. అదీగాక బాబా భాస్కర్ కి భాష పరంగా కూడా ఇబ్బంది ఉండడంతో ఎక్కువసేపు వాదించకుండా నామినేట్ అవడానికి రెడీ అయినట్టు కనిపించాడు.


అలా కాకుండా తన వాదనని వినిపించి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇక రాహుల్, వరుణ్ ల విషయానికి వస్తే, వీరిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కనిపించారు. ఒకరిలో మరొకరికి కనిపించే లోపాలు చెప్పాలని బిగ్ బాస్ చెప్తే, వీళ్ళు మాత్రం తమలో లోపాలే లేవన్నట్టు ఒకరినొకరు పొగుడుకున్నారు. అలా కాకుండా బిగ్ బాస్ చెప్పినట్టు చేస్తే ఆటలో మజా వచ్చేది. అదీ కాకుండా వరుణ్ నామినేట్ అవ్వాలని ముందే అనుకున్నాడు.


నామినేషన్ లోకి వచ్చి చాలా రోజులవుతున్న కారణంగా ఒకసారి వెళ్ళి ప్రేక్షకుల సింపతీ పొందాలని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే రాహుల్ ని ఎలాగైనా సేవ్ చేయాలని అన్నాడు. ఇక వితికా, రవిక్రిష్ణల దగ్గరికొస్తే, వీరిద్దరిలో మంచి వాడు అనే ట్యాగ్ ఉన్న రవి ఇక్కడ కూడా మంచివాడు అనిపించుకునేలాగా ప్రవర్తించాడు, వితికాలోని లోపాల్ని వెల్లడించే సమయంలో కూడా అతను తడబడ్డాడు. అలా కాకుండా ధైర్యంగా తాను అనుకున్న విషయాన్ని చెప్పి ఉంటే డిస్కషన్ పెరిగి, ప్రేక్షకులకు ఆసక్తి కలిగేది. ఒక్క శ్రీముఖి, శివజ్యోతి ల చర్చ తప్ప,ఎవరూ సరిగ్గా చర్చించలేకపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: