షారుక్ ఖాన్ బాలీవుడ్ లో తిరుగులేని నటుడు.  ఈ హీరో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశాడు.  తనను తాను నిరూపించుకున్నాడు.  గత కొంతకాలంగా హిట్స్ కోసం ఇబ్బందులు పడుతున్నాడు.  ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.  ఇక ఇదిలా ఉంటె, షారుక్...గౌరీ ఖాన్ ల ముద్దుల కూతురు సుహానా ఖాన్ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నది.  తండ్రిలానే సక్సెస్ బాటలో పయనించాలని చూస్తోంది. 


ఇటీవలే చదువు పూర్తి చేసుకొని వచ్చిన సుహానా సినిమా ట్రయల్స్ లో ఉన్నది.  షారుక్ కో స్టార్స్ అనిల్ కపూర్ కూతురు ఇప్పటికే సినిమాల్లో రాణించింది.  అటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీఖాన్ కూడా సినిమాల్లో రాణిస్తోంది.  అమీర్ ఖాన్ కూతురు కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నది.  దీంతో ఇప్పుడు షారుక్ కూతురు కూడా సినిమా రంగంలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.  


దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వారసురాళ్లు మధ్య పోటీ తప్పనిసరిగా ఏర్పడే అవకాశం ఉన్నది.  పోటీ తత్త్వం పెరగడంతో పాటుగా అందరి మధ్యన సుహృద్భావ వాతావరణం కూడా ఏర్పడే  అవకాశం ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, షారుక్ ఖాన్ కూతురు  ఎప్పుడు ఒకే చెప్తే అప్పుడు ఆమెను ఇంట్రడ్యూస్ చేయడానికి కరణ్ జోహార్ సిద్ధంగా ఉన్నాడు.  అలానే షారుక్ ఖాన్ సొంత బ్యానర్ కూడా రెడీగా ఉన్నది. ఇక ఇప్పటికే సుహానా ఖాన్ సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నది.  


బికినీ ఫొటోలతో అప్పుడే తనను తాను పాపులర్ చేసుకుంటోంది.  బాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే అందాలు ఆరబోయాయి.  దీనికోసం సుహానా రెడీ గా ఉన్నట్టుగా ఆమె ఇంస్టాగ్రామ్ బికినీ ఫోటోలు చూస్తుంటే అర్ధం అవుతున్నది.  న్యూ ఇయర్ సందర్భంగా సుహానా అలీఖాన్ బికినీ ట్రీట్ ఇచ్చి అదరగొట్టింది.  ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి.  హల్చల్ చేస్తున్నాయి.  భారీ ఎత్తున షేర్ అవుతున్నాయి.  సుహానా బాలీవుడ్ లో అడుగుపెడితే మరో సంచలనం గ్యారెంటీ అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: