సంచలన దర్శకుడు రాంగోపాల్ గత కొంత కాలంగా తీస్తున్న సినిమాలు ఎంత కాంట్రవర్సీలు ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాంగోపాల్ వర్మను టార్గెట్ చేయడం అంటే... అది మన సమయం వృథా చేసుకోవడం మినహా మరేం కాదు. ఎందుకంటే... అతను దేన్నయినా స్వీకరిస్తాడు. దేన్నయినా వాడుకుంటాడు. అన్నిటికీ తెగించి...మందు కోసం, మగువల కోసం బతుకుతుంటాడు. అలా అని వారి వెంటపడి బతిమాలే టైపు కాదు, తన లెక్కలేని తనమే, కాంట్రవర్సిజమే తన ఆస్తిగా... హాయిగా బతికేస్తాడు.  ఆ మద్య ఆయన తెరకెకకించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాలు ఎన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ తీస్తున్న విషయం తెలిసిందే. 

 

ఎన్టీఆర్ బయోపిక్ మొదలు మొన్న ఏపీ రాజకీయాలను టార్గెట్‌ చేస్తూ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు దాకా అన్ని సినిమాలు పోలిటికల్‌ గా బాగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ సమయంలో వర్మతో రచయిత జొన్నవిత్తులకి సెమీ వార్ జరిగింది.  ఆ తర్వాత  అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మూవీ టైటిల్ మార్చి రిలీజ్ చేశారు.   అయితే 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' మూవీ సమయంలో రచయిత జొన్నవిత్తుల, దర్శకుడు ఆర్జీవీ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందన్న సంగతి తెలిసిందే.   వర్మ శ్రుతి మించి మాట్లాడడంతో జొన్నవిత్తుల ఏకంగా వర్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తానంటూ ప్రకటించి షాక్‌ ఇచ్చాడు. 

 

అక్కడితో ఆగక ఆర్జీవీ అనే టైటిల్‌తో సినిమాను రూపొందించేందుకు జొన్నవిత్తుల సిద్ధమయి ఆర్జీవీ సైకో బయోపిక్‌ అనేది ట్యాగ్‌ లైన్‌ తో రిజిస్ట్రేషన్ కి కూడా పంపారు. అయితే ఈ సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్‌ విషయంలో ఆయనకు షాక్ ఇచ్చారు ఫిలిం చాంబర్ వాళ్ళు.  ఇప్పుడు జొన్నవిత్తులకు ఫిల్మ్ చాంబర్ ఊహించని షాక్ ఇచ్చింది. 'ఆర్జీవీ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేసేందుకు నిరాకరిస్తూ, రామ్ గోపాల్ వర్మ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించింది. దీంతో ప్రస్తుతానికి జొన్నవిత్తుల ప్రయత్నానికి బ్రేక్ పడినట్లే. ఈ విషయం ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: